Andhra Pradesh: చదువుకునే పరిస్థితుల నుంచి చదువుకొనే స్టేజ్ కు మన విద్యావ్యవస్థ ఎప్పుడో చేరుకుంది. ప్రతిభ ఉండి చదువును కొనే స్తొమత లేని స్టూడెంట్స్ కొందరు తమ చదువులకు గుడ్ బై చెప్పి.. జీవనం కోసం దొరికిన పని చేసుకుంటున్నవారు.. మరికొందరు.. తమకు ఇష్టమైన చదువుకి దూరమైపోతామని ఆవేదనతో ఏకంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా ఆంద్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో విద్యార్థిని సూసైడ్ కలకలం సృష్టించింది. హరిత అనే విద్యార్థినికి ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ తనను తల్లిదండ్రులు చదివించరనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కూతరు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని..కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు హరిత రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. హరిత మృతదేహాన్ని పోర్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
హరిత సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయాలు
అమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో మనం బతకడం కూడా కష్టంగా మారింది. మరోవైపు నాకు ,చెల్లికి చదువు కోసం ఫీజ్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు అందుకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరిత ఉత్తరంలో పేర్కొంది. అంతేకాదు తల్లిపై హరితకు ఉన్న ప్రేమని తెలియజేసే విధంగా .. మా వల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకో మాకు అమ్మ అంటూ కోరింది. చెల్లిని బాగా చదివించండి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోమని సూచించింది. తాను తల్లికి భారం అవ్వకూడదని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. అమ్మా నన్ను క్షమించు… నీకు నేను. ఏమి చేయలేకపోతున్నా అంటూ ఆర్తిగా కోరింది. నేను చనిపోయినందుకు ఏడవకండి.. నువ్వు.. చెల్లి జాగ్రత్త అంటూ అనేక సూచనలు చేసింది హరిత.
నాన్న డబ్బులు పంపిస్తాడో లేడో.. నాన్న పంపించకపోతే ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది కదమ్మా .. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నానని ఉత్తరంలో హరిత పేర్కొంది. ఎవరైనా ఎందుకు తాను ఆత్మహత్య చేసుకున్నానని అడిగితే.. ఎంసెట్ గ్రాంట్ రాలేదని.. అందుకనే చనిపోయిందని చెప్పండని తల్లికి సూచించింది. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ.. చెల్లి జాగ్రత్త గా చదువుకోమని చెప్పు.. నన్ను చదివించే స్టేజిలో మీరు లేరు.. అంటూ తమ ఆర్ధిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ హరిత ఉత్తరం రాసింది. హృదయ విదారకంగా ఉన్న హరిత సూసైడ్ నోట్ చూసిన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
బ్యాంక్ ఏఈజెంట్లు వేధింపులే కారణమా..!
తన కూతురు ఆత్మహత్యకు బ్యాంక్ ఏఈజెంట్లు వేధింపు కారణం అంటూ హరిత తల్లి ఆరోపిస్తోంది. నందిగామలో బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో విద్యార్దిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. హరిత తండ్రి తీసుకున్న బ్యాంక్ లో అప్పు తీర్చాలని ఇంటికొచ్చి బ్యాంక్ రికవరీ ఏజెంట్లు బెదిరించారు. అంతేకాదు డబ్బులు కట్టకపోతే కూతుళ్ళని గేదెలు కాయించాలని ఏజెంట్లు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఏజెంట్లు చేసిన హరిత అవమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఆరోపిస్తోంది. ఎంసెట్ లో పదిహేను వేల రాంక్ సాధించింది.
హరిత సూసైడ్ కేసులో ఏజెంట్ల పరారీ
హరిత ఆత్మహత్యతో బ్యాంక్ రికవరీ ఏజెంట్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. హరిత సూసైడ్ ఘటనపై ప్రయివేటు ఏజెన్సీ కార్యాలయాని టీవీ 9 బృందం వెళ్ళింది. అయితే టివి9 కెమెరా చూసి రికవరీ ఏజెంట్లుతలుపులు వేసుకున్నారు. గతంలోనూ లోక్ చెల్లించనివారిపై వేదింపులకు పాల్పడ్డట్లుగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..