Giant Python: గ్రామస్థులు చూస్తుండగానే కుక్కను అమాంతం మింగిన కొండచిలువ.. ఆ తర్వాత
Annamayya District: జనావాసాల్లో భారీ సైజు కొండచిలువ... 13 అడుగుల పొడవున్న పైథాన్... చూస్తేనే వళ్లు గగుర్పొడిచేలా భయానకంగా ఉంది. ఒక్కసారిగా నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. బెంబేలెత్తిపోయిన జనం తలోవైపు పరుగులు తీశారు. ఆపై..

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లికి సమీపంలో పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆ తోటల నుంచి వచ్చిందో.. మరో మార్గంలో వచ్చిందో తెలియదు కానీ.. ఓ భారీ కొండచిలువ గ్రామస్థులను హడలెత్తించింది. గ్రామస్థులు చూస్తూ ఉండగానే.. అది ఓ కుక్కపైకి అటాక్ చేసి.. దాన్ని అమాంతం మింగేసింది. కుక్కను తిని.. కదల్లేక అక్కడే ఉండిపోయింది. మాములుగా కాటేసే పాములను చూస్తే జనాలు జడుసుకుంటారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అలాంటిది ఇలా బతికున్న జీవున్న మింగేసే కొండచిలువ కనిపించేసరికి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై కొండచిలువను కొట్టి చంపారు. గ్రామస్థులు దాడి చేసిన సమయంలో.. మింగిన కుక్కను బయటకు కక్కేసింది కొండచిలువ. అప్పటికే కుక్క కూడా ఊపిరాడక చనిపోయింది.
ఇళ్లలోకి …పిల్లలు ఆడుకుంటున్న ప్రాంతాల్లోకి పాములు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులు కాలనీలో ఇంకా ఏవైనా పాములు ఉంటే పట్టుకొని అడవిలో వదిలిపెట్టాలని వేడుకుంటున్నారు. ప్రజంట్ ఎండలు వాయగొడుతున్న విషయం తెలిసిందే. తాపానికి వన్యప్రాణులు, పాములు జనావాసాల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అడవులు, పొలాలకు సమీప ప్రాంతాల్లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇవ్వాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..




