గంజాయి తరలిస్తూ చిక్కిన ఆరుగురు.. వారిని విచారించగా పోలీసుల మతి పోయింది..

|

Dec 30, 2023 | 3:12 PM

వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని... రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోని స్టోర్‌ రూమ్‌లో భద్రపరచారు. రవితేజ, కుసుమకుమార్‌, తేజ, సాయి, వెంకటేష్‌, గణేష్‌, మరో ఇద్దరు మైనర్లు కలిసి... ఆ గంజాయిని దొంగిలించారు. స్టోర్‌ రూమ్‌ కిటికీ గ్రిల్‌ తొలగించి.. లోపలికి చొరబడ్డారు. స్టోర్‌ రూమ్‌లో దాచిన 362 కిలోల గంజాయి దోచుకెళ్లారు.

గంజాయి తరలిస్తూ చిక్కిన ఆరుగురు.. వారిని విచారించగా పోలీసుల మతి పోయింది..
Police Station
Follow us on

ఒకప్పుడు ఏపీలో గంజాయి అక్రమ రవాణా విపరీతంగా సాగేది. ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు విసృత తనిఖీలు చేసి.. చిక్కినవారిని జైల్లో వేయడంతో.. గంజాయి స్మగ్లింగ్ చాలావరకు ఆగిపోయింది. అయితే ఇటీవల అనకాపల్లి జిల్లాల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో ఉంచిన గంజాయినే తాము దొంగిలించామని నిందితులు చెప్పడంతో.. పోలీసులు విస్తుపోయారు. వారు చెప్పిన విషయం నిజమా కదా అని.. స్టేషన్‌లో పరిశీలించగా.. వాస్తవమే అని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పలుమార్లు పట్టుబడిన గంజాయిని అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్​ పోలీస్‌స్టేషన్‌ స్ట్రాంగ్​ రూమ్​లో ఉంచారు పోలీసులు. అయితే 2 రోజుల క్రితం సోమన్నపాలెం సమీపంలో గంజాయి రవాణా చేస్తూ ఆరుగురు యువకులు చిక్కారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, యలమంచిలి రూరల్​ పోలీస్​ స్టేషన్​లోని స్ట్రాంగ్​ రూం నుంచి దొంగిలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్టేషన్​లోని గంజాయిని తూకం వేయగా, పట్టుబడిన గంజాయి, తూకంలో తక్కువ వచ్చిన దానికి దాదాపుగా లెక్క కుదరింది. పలు దఫాల్లో స్టేషన్ నుంచి గంజాయి చోరి చేయగా, ఇప్పుడు తరలిస్తూ పట్టుబడినట్లు దొంగలు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుంగా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..