స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్: మార్చి 30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్..
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం జగన్..విద్యార్థులకు బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్..

స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్: మార్చి 30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్..ఇకపై ఎప్పటికప్పుడే చెల్లింపులు: జగన్ ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ని అందించింది. రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మంచి చదువును అందించే దిశగా కృషి చేస్తోంది… విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యానందించినపుడే వారు పోటీ ప్రపంచంలో నెగ్గుకొని రాగలుగుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులతోనే వారి భవిష్యత్ బంగారు మయం అవుతుందని చెప్పారు. అలాంటి మంచి చదువులను అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. విద్యాశాఖతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన సీఎం…ఫీజు రియింబర్స్ మెంట్‌పై విద్యార్థులకు భరోసానందించారు… రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. అందుకోసం విద్యార్థులకు బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. మార్చి 30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫీజులు చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని కాలేజీలకు సూచించారు సీఎం జగన్… అందుకోసం విద్యార్థుల చదువులకయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. ఇందులో భాగంగానే ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగితే కాలేజీలకు మంచి జరుగుతుందన్నారు. కాలేజీలు తమ కార్యకలాపాలను ప్రశాంతంగా, సాఫీగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. ఇక ఇందులో భాగంగానే గత ఏడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించిన మొత్తాలను కూడా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్చి 30 నాటికి ఈ చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టామని సీఎం జగన్ వెల్లడించారు.