AP Crime: సచివాలయంలో ఉద్యోగం.. నెలకు రూ.డెబ్భై వేలు జీతం.. జాబ్ పేరుతో టోకరా.. చివరకు

|

Feb 27, 2022 | 1:44 PM

ఐఏఎస్ అధికారులమంటూ పరిచయం పెంచుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం(job fraud) ఇప్పిస్తామని నమ్మించారు. నెలకు రూ.డెబ్భై వేలు జీతం వస్తుందని మాయమాటలు చెప్పారు...

AP Crime: సచివాలయంలో ఉద్యోగం.. నెలకు రూ.డెబ్భై వేలు జీతం.. జాబ్ పేరుతో టోకరా.. చివరకు
Job Fraud Gang Arrest
Follow us on

ఐఏఎస్ అధికారులమంటూ పరిచయం పెంచుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం(job fraud) ఇప్పిస్తామని నమ్మించారు. నెలకు రూ.డెబ్భై వేలు జీతం వస్తుందని మాయమాటలు చెప్పారు. దీనికి రూ.పది లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. వీరి మాటలు నమ్మిన నిరుద్యోగ యువకుడు, అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బులు ఇచ్చారు. విడతల వారీగా రూ.పదకొండున్నర లక్షలు ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నా.. ఉద్యోగం రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తనను సంప్రదించిన వారి వద్దకు వెళ్లి ఆరా తీశాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డబ్బులు, సర్టిఫికెట్లు కావాలని కోరాడు. డబ్బులు అడిగితే చంపేస్తామని వారు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టి నలుగురిని అరెస్టు(Arrest) చేశారు. వారి నుంచి నగదు, సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయం, హైకోర్టులో ఉద్యోగాల పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్న ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. పదకొండున్నర లక్షలు వసూలు చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు‌. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడుకు చెందిన నరేష్ ఎంబీఏ చదివాడు. కొద్ది రోజుల క్రితం అతని తండ్రికి శ్రీనివాసరావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నరేష్ తండ్రి శ్రీనివాసరావు.. తన కుమారుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు. దీనిని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాసరావు తన అల్లుడు ఐఏఎస్ అధికారి అని, అతని ద్వారా సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.

సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని..

ఓ రోజు శ్రీనివాసరావు.. నరేష్, అతని తండ్రిని తన అల్లుడు వెంకటేశ్వర్లు వద్దకు తీసుకెళ్లాడు. వారికి వెంకటేశ్వర్లు అతని స్నేహితులైన శ్రీనివాసరావు, నాగార్జున, మోషేలను పరిచయం చేశాడు. సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని, నెలకు రూ.70,000 జీతం వస్తుందని నమ్మించారు. ఈ ఉద్యోగం కోసం రూ.పది లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. వీరి మాటలు నమ్మిన నరేష్, అతని తండ్రి శ్రీనివాసరావులు విడతల వారీగా రూ. పదకొండున్నర లక్షలు ఇచ్చారు. అంతే కాకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు.

నలుగురు అరెస్టు..

రోజులు గడుస్తున్నా.. ఉద్యోగం రాకపోవడంతో నరేష్ కు అనుమానం వచ్చింది. వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి తనకు ఉద్యోగం కావాలని అడిగాడు. వెంకటేశ్వర్లు నుంచి పొంతన లేని సమాధానం రావడంతో వీరి గురించి ఆరా తీశాడు. వారందరూ ఐఏఎస్ అధికారులు కారని, తనను మోసం చేశారని గ్రహించాడు. డబ్బులు, సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగాడు. అయితే డబ్బులు అడిగితే చంపేస్తామని నరేష్ ను ముఠా సభ్యులు బెదిరించారు. దీంతో ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో నరేష్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.ఐదున్నర లక్షలు, ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

    – టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

Also Read

Dog Viral Video: బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతూ.. తగ్గేదెలే అంటున్న శునకం వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను..! అంటున్న ఈ వ్యక్తి.. వైరల్ వీడియో

నయా లుక్ లో అదరగొడుతున్న ధోనీ.. అభిప్రాయాలు తెలపాలంటున్న స్టార్ స్పోర్ట్స్