Paritala Sunitha: నా నుదిటిపై కుంకుమ లేకపోవడానికి కారణం ఎవరు.. సునీతమ్మ భావోద్వేగం

మాజీ మంత్రి పరిటాల సునీత భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త పరిటాల రవిపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Paritala Sunitha: నా నుదిటిపై కుంకుమ లేకపోవడానికి కారణం ఎవరు.. సునీతమ్మ భావోద్వేగం
Paritala Sunitha

Updated on: Mar 08, 2023 | 6:22 PM

మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు.  కొంతమంది చిల్లర వెదవలు పరిటాల రవి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రవి గురించి చిల్లర వాళ్లకు ఏం తెలుసని ప్రశ్నించారు.  ఒక మహిళ భర్తను కోల్పోతే ఆ కుటుంబంలో బాధ ఎలా ఉంటుందో తెలుసా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా నుదిటిపై మీద కుంకుమ లేకపోవడానికి కారణం ఎవరంటూ సునీత ఎమోషల్ అయ్యారు.

వైసీపీ నాయకులు ఎంతోమంది పసుపు కుంకాలు తుడిపేశారని ఆరోపించారు సునీత.  ఆ కుటుంబాల్లో మహిళల్ని అడగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. తమ కుటుంబం గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోరని..  తమ లాంటివారు ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి అడ్డుకుంటారని ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు లేరని సునీత పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us