Andhra Pradesh: హోం మంత్రి కారుపై చేయి పడితే నా కారుపై పడినట్లే.. మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్య

| Edited By: Ravi Kiran

May 04, 2022 | 5:05 PM

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy).. బాహుబలి రేంజ్ లో రెచ్చిపోయారు. హోం మంత్రి కారుపై చేయి పడితే తన కారుపై పడ్డట్టే అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను చెప్పారు. గర్భంతో ఉన్న మహిళపై...

Andhra Pradesh: హోం మంత్రి కారుపై చేయి పడితే నా కారుపై పడినట్లే.. మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్య
Balineni
Follow us on

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy).. బాహుబలి రేంజ్ లో రెచ్చిపోయారు. హోం మంత్రి కారుపై చేయి పడితే తన కారుపై పడ్డట్టే అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను చెప్పారు. గర్భంతో ఉన్న మహిళపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్దికసాయం చేసిందని, వ్యక్తిగతంగా తాను కూడా రూ.2 లక్షల సాయం అందించానని బాలినేని తెలిపారు. గతంలో టీడీపీ(TDP) హయాంలో కమ్మపాలెంకు వెళ్తున్న తనను కూడా ఇలాగే అడ్డుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ నేతల చర్యలకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బాలినేని హెచ్చరించారు. రేపల్లె ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం హేయమని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార ఘటన బాధితురాలిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారని, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆమె పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలని కేంద్రానికి, రైల్వే అధికారులకు లేఖ రాశామని వివరించారు. ఒంగోలు వచ్చిన హోంమంత్రిని టీడీపీ కార్యకర్తలు వచ్చి అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ నేతలు సంఘ విద్రోహశక్తులుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Picture Puzzle: ఇది కదా సరైన పజిల్ అంటే.. మాములు కన్‌ఫ్యూజన్ కాదు.. పిల్లిని కనిపెట్టండి చూద్దాం

Alcohol: మీరు మద్యం ఎక్కువగా తాగుతున్నారా..? ప్రమాదమే.. ఇవి పూర్తిగా దెబ్బతింటాయి..!