Ab Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు మరో షాక్‌.. సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Ab Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ..

Ab Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు మరో షాక్‌.. సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Updated on: Jan 19, 2021 | 8:01 PM

Ab Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ సస్పెన్షన్‌ పొడిగింపు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏపీ సర్కార్‌ ఆయనను గతంలో విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

కాగా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో 2018-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు జగన్‌ ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో భాగంగా భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావు పై వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:

Bowenpally Kidnap Case: బోయినపల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ .. రేపు విచారణ