Palnadu: పల్నాడులో పెరుగుతున్న పులల సంఖ్య…

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలోని నీటి కుంట వద్దకు వచ్చిన పులులను లెక్క తీసిన అనంతంర అధికారులు ఈ వివరాలు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి డేటా విడుదల చేయనున్నారు అధికారులు.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Palnadu: పల్నాడులో పెరుగుతున్న పులల సంఖ్య...
Tigers

Edited By:

Updated on: Feb 13, 2025 | 11:22 AM

ఏపిలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా శ్రీశైలం సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు గాంచింది. గత కొంతకాలంగా ఈ అభయారణ్యంలో పులల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పల్నాడు జిల్లాలో వ్యాపించి ఉన్న నలమల ఫారెస్ట్ పరిధిలో ఉన్న అభయారణ్యంలో కూడా గతంలో కంటే పులల సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ నెల పదో తేదితో పులుల గణన పూర్తయింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఇంకా ఫారెస్ట్ అధికారులు విడుదల చేయలేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం గతం కంటే వాటి సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు.

పులుల రక్షణ కోసం ఈ అభయారణ్యంలో అనేక చర్యలు చేపట్టడంతో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాసర్ పిట్స్(వన్యప్రాణులకు తాగునీరు అందేందుకు అడవుల్లో ఏర్పాటు చేసే గుంతలు) వద్దకు నీటి కోసం వచ్చిన పులులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. ట్రాప్ కెమెరాలు, పాద ముద్రలు సేకరించిన పారెస్ట్ సిబ్బంది వీటి ఆధారంతోనే పులల సంఖ్యను లెక్కిస్తారు.

రెండేళ్ల క్రితం పల్నాడు జిల్లా దుర్గి మండలం గజాపురం వద్ద వేసవిలో పులులు కనిపించాయి. రెండు పులులు కనిపించడమే కాకుండా ఆవుపై దాడి చేసి చంపేశాయి. అయితే తీవ్ర నీటి ఎద్దడి కారణంగా రక్షణ ప్రాంతం దాటి గ్రామాలవైపు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత వెల్ధుర్ధి మండల పరిధిలోని నలమల ఫారెస్ట్‌లో మొత్తం ఆరు వరకూ పులులు ఉన్నట్లు అంచనా వేశారు. వీటిలో నాలుగు చిన్న పులలు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీ సమీప ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అదే విధంగా అడవిలోకి వెళ్లే సమయంలో పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రెండు మూడో రోజుల్లో నలమల అటవీ ప్రాంతం మొత్తంలో ఎన్ని పులులున్నాయో వాటి వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి