Illness for 25 devotees in Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా అనంతపురం నుంచి స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చారు. కాగా వారందరినీ సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నెరజాం గ్రామానికి చెందిన 120 మంది భక్తులు బుధవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రం శ్రీశైలం వచ్చారు. స్వామి వార్ల దర్శనం అనంతరం రాత్రివేళ తామవెంట తీసుకొచ్చిన ఆహారాన్ని తిని పడుకున్నారు. ఈ క్రమంలో వారిలో 25 మంది భక్తులకు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే వారిని 108 వాహనంలో సున్నిపెంట ప్రాజెక్టు ఆసుపత్రికి తరలించారు.
బాధితులకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే ఒక వ్యక్తికి మాత్రం రక్త విరేచనాలవుతున్నాయని.. అతన్ని వేరే ఆసుపత్రికి రిఫర్ చేయనున్నట్లు తెలిపారు.
Also Read:
Sucide Attempt: ఏలురు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు..