ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం దాచారం గుండేటి వాగుకు ఆకస్మికంగా వరద వచ్చింది. దీంతో జేసీబీలు కొట్టుకుపోతున్నాయ్. గుండేటి వాగు వరద ఉధృతితో విద్యుత్ మోటర్లు నీటిపాలైయ్యాయి. వాగు ప్రవాహం ఎక్కువ అవ్వడంతో వరదలో జేసీబీ కొట్టుకుపోవడంతో డ్రైవర్ ప్రాణాలతో ఎలాగోలా బయటపడ్డాడు. పంట పొలాలకు నీరు తోడే విద్యుత్ మోటర్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.