Andhra Pradesh: కలకలం రేపుతున్న ఐదు నెలల చిన్నారి కిడ్నాప్.. నిద్రపోతున్న సమయంలో అపహరించిన దుండగులు..

కూలీ నాలీ చేసుకుంటే గానీ కడుపు నిండని కడు పేదలు. ఉండటానికి ఇల్లు కూడా లేక బస్టాండ్ లో తలదాచుకుంటున్నారు. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది....

Andhra Pradesh: కలకలం రేపుతున్న ఐదు నెలల చిన్నారి కిడ్నాప్.. నిద్రపోతున్న సమయంలో అపహరించిన దుండగులు..
kidnap

Updated on: Sep 14, 2022 | 12:25 PM

కూలీ నాలీ చేసుకుంటే గానీ కడుపు నిండని కడు పేదలు. ఉండటానికి ఇల్లు కూడా లేక బస్టాండ్ లో తలదాచుకుంటున్నారు. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కంటికి రెప్పలా చిన్నారిని చూసుకుంటూ మురిసిపోయారు. కానీ వారి ఆనందం తొందరగానే ఆవిరైంది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేద తీరుతున్న శిశువును దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం నిద్రలేచాక చిన్నారి కనిపించకుండా పోవడాన్ని చూసి ఆ దంపతులు షాక్ అయ్యారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ కుమారుడిని తీసుకురావాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐదు నెలల శిశువు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. బంటుమిల్లిలో ఐదు నెలల శిశువు కనిపించకుండాపోయింది. దీంతో శిశువు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

బంటుమిల్లి బస్టాండ్ లో పది సంవత్సరాలుగా మల్లా చిలకయ్య, వెంకటేశ్వరమ్మ దంపతులు తలదాచుకుంటున్నారు. ఐదు నెలల క్రితం వెంకటేశ్వరమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బిడ్డతో కలిసి సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అపహరించారు. ఉదయం లేచి చూసుకున్న దంపతులకు తమ కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా జాడ కనిపించకపోవడంతో కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శిశువును అపహరించిన దుండగుల కోసం సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us