Fish Market: ఆకివీడు చేపల మార్కెట్‌లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణం… కిలో చేపలు కేవలం రూ.40 మాత్రమే.!

|

Apr 20, 2021 | 8:43 PM

Fish Market: కరోనా మహమ్మారి కొందరికి మేలు చేస్తే... మరికొందరికి కీడు చేసిందంటున్నారు రైతులు. అవును...కరోనా విజృంభిస్తుండటంతో అనేకమంది నాన్‌వెజ్‌ ప్రియులు...

Fish Market: ఆకివీడు చేపల మార్కెట్‌లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణం... కిలో చేపలు కేవలం రూ.40 మాత్రమే.!
Fish markets
Follow us on

Fish Market: కరోనా మహమ్మారి కొందరికి మేలు చేస్తే… మరికొందరికి కీడు చేసిందంటున్నారు రైతులు. అవును…కరోనా విజృంభిస్తుండటంతో అనేకమంది నాన్‌వెజ్‌ ప్రియులు మటన్‌, చికెన్‌లకు ఎగబడ్డారు. దాంతో కిలో మటన్‌ ధర వెయ్యి రూపాయలకు చేరువైంది. కిలో చికెన్‌ ధర 250 నుంచి 300 దాటింది. అదే సమయంలో చేపలు కూడా 150 నుంచి రూ.200 వందల దాకా ధర పలికింది. కొర్రమీనులైతే ఏకంగా కిలో రూ.400 పలికింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ ఫిష్ మార్కెట్‌పై పడింది.

పశ్చిమగోదావరిజిల్లా ఆకివీడు చేపల మార్కెట్‌లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. కోవిడ్‌ విజృంభిస్తుండటంతో ఈ ప్రాంతంలో చేపల ఎగుమతులు పూర్తిగా నిలిపివేశారు. పట్టిన చేపలను ఆటోలు, వ్యాన్‌లలో మార్కెట్‌కు తరలిస్తున్నారు రైతులు. చేపల ఎగుమతులు లేకపోవడంతో మార్కెట్‌కు వచ్చినా…సరుకు కొనేవారు లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటివరకూ కిలో 150 రూపాయలు పలికిన చేపల ధర…ఇప్పుడు 40 నుండి 50 రూపాయలు పలుకుతోంది.

ఒక్క ఆకివీడే కాదు…పలు ప్రాంతాల్లోని చేపల మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా చేపల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: Health Insurance: ఆరోగ్య బీమా రంగంలో కరోనాతో పెరిగిపోతున్న క్లెయిమ్‌లు… ప్రీమియంలు పెంచే ఆలోచన..!

Smallest Cow: బుజ్జి ఆవుకు.. బుల్లి దూడ.. తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేస్తున్న చిట్టి దూడ