Andhra Pradesh: దీపావళి పండుగ రోజు అపశృతి.. బాణసంచా పేలి ఒకరి మృతి

దీపావళి పండుగ పూట అపశృతి జరిగింది. ఏలూరులో బాణసంచా పేలి ఒకరి మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. 

Andhra Pradesh: దీపావళి పండుగ రోజు అపశృతి.. బాణసంచా పేలి ఒకరి మృతి
Fireworks Explosion

Updated on: Oct 31, 2024 | 2:06 PM

దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి చోటుచేసుకుంది.  ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబు బస్తా తీసుకువెళుతుండగా గోతిలో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంఘటనతో ఒక్కసారిగా తూర్పు వీధి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి