MR Government Hospital Fire Accident : విజయనగరం జిల్లా ఎం.ఆర్. ప్రభుత్వ ఆసుపత్రిలో పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా హాస్పటల్ ఉన్న కోవిడ్ బాధితులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది మంటలార్పి, అధికారులకు సమాచారం ఇచ్చారు. కోవిడ్ ఐసియూలో ఉన్న కోవిడ్ బాధితులను, మిగిలిన వార్డులోని కోవిడ్ రోగులను సాధారణ వార్డుకి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. లేదంటే, భారీ ప్రమాదమే జరిగి ఉండేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also…
Mehul Choksi: పంజాబ్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ అదృశ్యం..?