Fire Accident: కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు పూరిళ్లు దగ్దం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం..
కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరు పూరి ఇళ్లు దగ్దం అయ్యాయి.

కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరు పూరి ఇళ్లు దగ్దం అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండ్ లీక్ అవడం వల్లే మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
ఈ ఏడాది లక్కీ హీరోయిన్.. వరుస ఆఫర్లతో ఫుల్ బిజి.. ఆ హీరో సరసన నటించే ఛాన్స్.. ఎవరంటే?..
స్నేహ హస్తం… బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు… కలిసి పని చేయాలని ఆకాంక్ష…
