Fire Accident తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం… ఒకదాని తరువాత ఒకటిగా పేలిన గ్యాస్ సిలిండర్లు..

Fire Accident: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ గాంధీ పార్కు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు..

Fire Accident తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం... ఒకదాని తరువాత ఒకటిగా పేలిన గ్యాస్ సిలిండర్లు..
Fire Accident

Updated on: Mar 19, 2021 | 6:50 AM

Fire Accident: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ గాంధీనగర్‌లోని ఎల్విన్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా సిలిండర్లు పేలాయి. తెల్లవారుజామున ఉదయం 4.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ భయానక ప్రమాదంతో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది. వివరాల్లోకెళితే.. స్థానిక పూరి గుడిసెలో టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. అందులోని ఆరు సిలిండర్లు ఇవాళ తెల్లవారు జామున ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో పక్కనే ఉన్న ఆరు పూరి గుడిసెలకు మంటలు వ్యాపించాయి. కాగా, ఒక దాని వెనుక మరొకటి పేలడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను ఆర్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో చనిపోయిన వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also read:

Nithin Keerthi Suresh: కీర్తి సురేశ్‌ను నితిన్‌ ఎలా రెచ్చగొట్టాడో చూశారా..? చివరికి చేసేదేమి లేక కీర్తి కూడా..

kajal Aggarwal: అక్కినేని హీరోతో తొలిసారి జతకట్టనున్న టాలీవుడ్‌ చందమామ… ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో..

ESIC Recruitment 2021: హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు..