చదువుకుని భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవడానికి కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్.. చిన్న విషయానికి గొడవపడి.. నడి రోడ్డు ఎక్కితే.. చూపరులకు రౌడీలా.. వీధి గూండాలా అనిపిస్తుంది.. తాజాగా కొందరు విద్యార్థులు రెచ్చిపోయారు.. నడిరోడ్డుపై వీధిగుండాల మాదిరి కొట్టుకున్నారు. ఇంతకీ..ఈ విద్యార్థుల ఘర్షణ దేనికోసం..అన్నది క్లారిటీ లేకపోవడం విశేషం.. పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో పాలిటెక్నిక్ విద్యార్థులు రెచ్చిపోయారు. రోడ్డుపై గుంపులు, గుంపులుగా ఒకరిపై మరొకరు దాడి చేసి కొట్టుకున్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని సీతా పాలిటెక్నిక్ విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగి వివాదం పెద్దదైయింది. పరస్పరం బూతులు తిట్టుకుంటూ కాలేజీ క్యాంపస్ బయటే నడిరోడ్డుపై గుంపులు, గుంపులుగా చేరి కొట్టుకున్నారు. ఈ విద్యార్థులంతా పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో సీతా పాలిటెక్నిక్ విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకు వచ్చారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఉరుకులు, పరుగులతో సినిమాను తలపించారు విద్యార్థులు. వీరి స్ట్రీట్‌ఫైట్‌తో రోడ్డుపై వెళ్లే వాహనదారులు హడలిపోయారు. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. విద్యార్థులను ఆపడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దాంతో విద్యార్థుల ఘర్షణను స్థానికులు కొందరు ఫోన్‌లో చిత్రీకరించారు. అది గమనించిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.
భీమవరంలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపుతోంది. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్…సెకండియర్ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్ చేశారా..? లేక ఏదైనా మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసిందా..? స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు దీనిపై క్లూ లాగుతున్నట్లు సమాచారం. అటు కళాశాల మేనేజ్‌మెంట్ దీనిపై ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..