AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: దొంగను పట్టుకునేందుకు ఓ రైతు ఏం చేశాడంటే…. టెక్నలాజియా… టెక్నలాజియా

పొలాల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పైపులు, మోటార్లు ఆయన పొలం నుంచి దొంగతనం అవుతున్నాయి. కొంతకాలం వాటిని కాపాడుకునేందుకు కాపలా కాసాడు. కానీ ఎల్లకాలం అక్కడే ఉండలేడు కదా. దీంతో అతని మనసులో ఓ ఆలోచన మెదిలింది. దాంతో అతను ఆ దొంగలను ట్రాక్ చేశాడు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Andhra: దొంగను పట్టుకునేందుకు ఓ రైతు  ఏం చేశాడంటే.... టెక్నలాజియా... టెక్నలాజియా
Farmer Ashok Reddy
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 05, 2025 | 8:03 PM

Share

మీ బైక్ లేదా కార్ ఎక్కడైనా పార్కింగ్ చేస్తే దొంగతనానికి గురైతే, వెంటనే తెలుసుకోవడానికి జిపీఎస్ వాడతారు కదా… అలానే గ్రామీణ ప్రాంతాల్లో, పంట పొలాల్లో దొంగలు వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, స్ప్రింక్లర్లు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేస్తున్నారు. వీరి బారినుంచి తన పొలాన్ని రక్షించుకోవడానికి ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. దొంగల్ని పట్టుకోవడానికి టెక్నాలజీని ఆయుధంగా మార్చాడు.

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ మండలం సత్తార్‌పల్లికి చెందిన రైతు అశోక్ రెడ్డి పొలంలో గత కొంతకాలంగా డ్రిప్ పైపులు, వ్యవసాయ పరికరాలు తరచూ దొంగతనానికి గురవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మూడుసార్లు దొంగతనాలు జరిగాయి. దొంగల బారి నుంచి తమ వస్తువులు కాపాడేందుకు.. అశోక్ రెడ్డి కొన్ని రోజులు తన పొలంలోనే కాపలా కూడా కాశారు. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండడం సాధ్యం కాదు కదా. అప్పుడు ఆ రైతు మనసులో ఓ ఆలోచన మెరిగింది. వ్యవసాయ పరికరాలకూ జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ అమర్చితే ఎలా ఉంటుందనే ఐడియా యూట్యూబ్‌ లో చూశాడు. వెంటనే అమెజాన్‌ నుంచి జీపీఆర్‌ఎస్ పరికరం ఆర్డర్ చేసి, తన పొలంలోని పరికరాలకు, డ్రిప్ పైపులకు అమర్చేశాడు.

రెండు రోజుల క్రితం తెల్లవారుజామున 4 గంటలకు జీపీఆర్‌ఎస్ పరికరం సిగ్నల్ మార్చింది. పొలంలో ఉండాల్సిన డ్రిప్ పైపులు మళ్లీ ఓ వేరే లొకేషన్‌లో కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అశోక్ రెడ్డి.. మరికొంతమంది రైతులతో కలిసి ఆ ట్రాకింగ్‌ను ఫాలో అయ్యాడు. ఓ బొలెరో వాహనంలో డ్రిప్ పైపులు తరలిస్తున్న దొంగలను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఓ చిన్న యాప్ సహాయంతో రైతు అశోక్ రెడ్డి చేసిన తెలివైన పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెక్నాలజీని ఉపయో‌గించుకుంటే… రైతులు కూడా ఎంత దూకుడుగా తమ ఆస్తిని కాపాడుకోగలరో ఈ ఘటన తెలియజేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..    

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..