దట్టమైన అడవి.. అందులో ఓ గుహ.. అక్కడ కనిపించిన సీన్ చూసి భద్రతా బలగాలకు షాక్..!

| Edited By: Balaraju Goud

Sep 07, 2024 | 12:56 PM

అది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం.. భద్రత బలగాలు ఆ ఏరియాను డామినేట్ చేస్తున్నాయి. బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 142 బెటాలియన్‎కు కీలక సమాచారం అందడంతో.. టార్గెట్ పాయింట్‎కు రీచ్ అయ్యారు

దట్టమైన అడవి.. అందులో ఓ గుహ.. అక్కడ కనిపించిన సీన్ చూసి భద్రతా బలగాలకు షాక్..!
Bsf In Aob
Follow us on

అది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం.. భద్రత బలగాలు ఆ ఏరియాను డామినేట్ చేస్తున్నాయి. బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 142 బెటాలియన్‎కు కీలక సమాచారం అందడంతో.. టార్గెట్ పాయింట్‎కు రీచ్ అయ్యారు. దట్టమైన అడవీ పరిసర ప్రాంతంలో వెతికినా ఏమీ కనిపించలేదు. ఓ చోట బండరాళ్లు, గుహలాంటి ప్రాంతం కనిపించింది. పెద్ద పెద్ద బండ రాళ్లు.. మధ్యలో గుహ.. అందులో ఏముంటుందిలే అనుకున్నారు. అయినా ఎక్కడో చిన్న అనుమానం. మెల్లగా సెర్చ్ చేసుకుంటూ అతి కష్టం మీద లోపలికి వెళ్లారు. అక్కడ పరిశీలిస్తే భారీగా పేలుడు పదార్థాలు..!

ఏఓబి లో మావోయిస్టుల డంపును ఒడిస్సా బిఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. డంపులో పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చెందిన అనేక వస్తువులను సీజ్ చేశారు. ఏవోబీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన డంపు ఉందని బిఎస్ఎఫ్ బలగాలకు సమాచారం అందింది. ఒడిస్సా లోని బోడిగెట్టలో గల 142 బిఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధి బెజ్జంగివాడ – దయాల్ తుంగీ అటవీ ప్రాంతంలో బిఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పెద్ద బండ రాళ్ళ మధ్య.. ఏదో ఉందన్నది భద్రత బలగాల అనుమానం.

అనుమానం నిజమైంది..!

ఆ అనుమానం నిజమైంది. గుహలో పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రి ని బిఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ డంపులో స్టీల్ క్యారేజీ, ఐడి బాంబులు రెండు, జెలిటీన్ స్టిక్స్62, ఎక్సైడ్ బ్యాటరీలు రెండు, 11 టోపీలు, 39 విజిల్స్, షోల్డర్ ర్యాంక్ స్టార్స్ 26, ఎలక్ట్రికల్ వైర్, రేడియో యాంటీనాలు, మావోయిస్టు బ్యానర్, కరపత్రాలు ఇతర సామాగ్రి ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టులో దాచిపెట్టినట్టు గుర్తించారు. భద్రతా బలగాలే టార్గెట్‎గా డంప్ సిద్ధం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో ఎటువంటి డంప్ లభించడం ఇది రెండవది.

ఆ ప్రాంతం వారికి కంచుకోట..

బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. మావోయిస్టులు, సానుభూతిపరులు ఈ ప్రాంతాన్ని తమ మనుగడ కోసం ఉపయోగించుకున్నారు. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుంచే మావోయిస్ట్‌ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు భద్రతా బలగాలు. కేంద్ర, రాష్ట్ర బలగాలు ఈ సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టాయి. అంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ల ఏరివేతకు నిర్వహిస్తున్నారు. విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్‌కౌంటర్లలో కీలక నేతలను ఒక్కొక్కరిగా భద్రతాబలగాలు మట్టుబెడుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..