Mysura reddy: గెజిట్ నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు.. కేంద్రం తీరుపై మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఫైర్

|

Jul 21, 2021 | 1:30 PM

రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడం జటిలం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి మండిపడ్డారు.

Mysura reddy: గెజిట్ నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు.. కేంద్రం తీరుపై మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఫైర్
Ex Mp Mysura Reddy
Follow us on

Mysura Reddy on Krishna, Godavari River board Gazette: రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడం జటిలం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారించుకోవల్సి అంశాలను ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం ఘర్షణపడి రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఎందుకు భేషజాలు అడ్డం వస్తున్నాయని ప్రశ్నించారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరా ఆక్షేపించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని హితవుపలికారు. కేంద్రం నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు.

కేంద్రం ఇచ్చిన గెజిట్‌ సీమ ప్రాజెక్ట్‌లకు గొడ్డలిపెట్టు లాంటిదని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. సీమ ప్రాజెక్ట్‌ల నీటి కేటాయింపులకు చట్టబద్ధత ఇవ్వకుండా గెజిట్‌ ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబుకు, ఇప్పుడు జగన్‌కు చెప్పినా ఆ పని జరగలేదన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల గ్రేటర్‌ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి, ప్రభుత్వం ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ప్రజల్లో వస్తుందన్నారు మైసూరారెడ్డి. ఈ గెజిట్‌ను ప్రభుత్వం ఆహ్వానించడం తప్పన్నారు.

Read Also… కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ భార్యకు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ..దివ్యాంగులకు ఉద్దేశించిన నిధుల్లో గోల్ మాల్ !