Andhra: విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

Andhra: విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..
Mamanduru Railway Station Incident

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 02, 2025 | 11:02 AM

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి ఇంటర్ సిటీ ప్యాసింజర్ ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు జాన్సన్ సహా 8 మంది స్నేహితులు వచ్చారు.. మామండూరు జలపాతం చూసేందుకు వెళ్ళాలని అందరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అందరూ.. ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి జలపాతం వద్దకు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు జాన్సన్.. ఆ సమయంలో హైటెన్షన్ తీగలను తాకాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికి తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై.. ఎగిరి రైలు పట్టాలపై పడ్డాడు.

విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డ జాన్సన్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనపై రేణిగుంటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..