
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగుచూసింది. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్నకోడలిని వేధిస్తున్నారు అత్తమామలు. బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని వేధించారు. అంగీకరించకపోవటంతో గదిలో బంధించారు.
పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నాడు. అయితే బాధితురాలి భర్తకు అన్న అయిన ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిది ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో బావ ప్రవీణ్‌కు పిల్లలను కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంగీకరించకపోవడంతో నిర్భంధించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. బాధితురాలని వేధిస్తున్న నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, మహిళా సంఘం నాయకులు. ఈ ఇష్యూపై ఫిర్యాదు అందిందని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే బాధితురాలి ఆరోపణలను అత్తమామలు ఖండిస్తున్నారు. తాము వేధించలేదని చెబుతున్నారు. తమది అలాంటి కుటుంబం కాదని.. తమపై కట్టు కథలు అల్లుతున్నారని.. విచారణలో నిజాలు తెలుస్తాయంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..