Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి విరుచుకుపడి పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన రేణిగుంట(Renigunta) మండలం మొలగముడి గ్రామం(Molagamudi Village) సమీపంలోని పంటపొలాల్లో చోటు చేసుకుంది. చెరకుసాగు చేసిన పంటల పొలాల్లో సంచరిస్తూ ఏనుగులు పంటను ధ్వసం చేసి.. నానా బీభత్సం సృష్టించాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు ఏనుగులు సృష్టించిన బీభత్సానికి గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ గ్రామాల్లోకి ఏనుగులు వస్తాయేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సురక్షిత ప్రాంతాలకు గ్రామస్థులు తరలి వెళుతున్నారు. ఏనుగుల సంచరిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరివైపు వడమాలపేట మండలం వెంగళ రాజు కండ్రిగ గ్రామంలో కూడ ఏనుగులు సంచరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.గత కొన్ని రోజులుగా తరచుగా ఏనుగులు ఇలా పంట పొలాల్లో దాడి చేస్తుండడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను తిరిగి అడవిలోకి వెళ్లేలా చేయాలని కోరుతున్నారు.
Also Read: