AP News: మన్యంలో గజరాజుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి..

|

Nov 03, 2024 | 11:19 AM

పార్వతీపురంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చూసి జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. సుమారు రెండు వందల కొబ్బరి చెట్లు ధ్వంసం చేశాయి.

AP News: మన్యంలో గజరాజుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి..
Elephants Hulchul In Parvathipuram District
Follow us on

పార్వతీపురంలో గజరాజుల బీభత్సం స్పష్టించాయి. అక్కడి రైతులకు ఏనుగులు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు రెచ్చిపోతున్నాయి. పార్వతీపురం మండలం నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. సుమారు రెండు వందల కొబ్బరి చెట్లు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో పలు చోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమ ప్రాణాలు రక్షించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం చూసి జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి