JC: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. మనీలాండరింగ్‌ చట్టం కింద జేసీ కంపెనీ ఆస్తులను అటాచ్‌..

|

Nov 30, 2022 | 12:59 PM

ప్రభాకర్‌రెడ్డికి షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్‌ చేసింది. BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయడం, కోట్ల రూపాయల పన్నులు..

JC: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. మనీలాండరింగ్‌ చట్టం కింద జేసీ కంపెనీ ఆస్తులను అటాచ్‌..
TDP Leader JC Prabhakar Reddy
Follow us on

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్‌ చేసింది. BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయడం, కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టడం వంటి అక్రమాలపై గతంలోనే విచారణ చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కంపెనీ వ్యవహరాలను చూసే సీ.గోపాల్‌రెడ్డికి చెందిన ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌లోకి వెళ్లాయి. నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించడం, ఆర్డీవో అధికారుల పేరుతో నకిలీ పత్రాలను సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది.

వాటి ఆధారంగానే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించింది. అశోకా లేలాండ్‌ కంపెనీ నుంచి స్క్రాప్‌లో వాహనాలను కొని, వాటిని BS4 వాహనాలుగా జఠాధరా కంపెనీ మార్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ప్రకటించింది ఈడీ.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం