
ప్రపంచ వ్యాప్తంగా జనాలంతా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొత్త సంవత్సరంలో కొత్త మొక్కలను పెంచుకోవాలనుకునే వారికి కడియం నర్సరీ ప్రత్యేక వెల్‌కమ్ చెబుతోంది. అక్కడికి వెళ్లిన ప్రేక్షకులను అందమైన మొక్కలు బలే ఆకర్షిస్తున్నాయి.

మీకు ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో దొరికే అన్ని రకాల మొక్కలు ఈ కడియం నర్సరీలో దర్శనం ఇస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం వేల ఇక్కడ కొత్త శోభ సంతరించుకుంది.

ముఖ్యంగా పల్లా వెంకన్న నర్సరీలో బ్రాచింగ్టన్ రూపి ట్రీస్. కొరియాసియా. స్పేస్ యోషా, బోగన్ విలియ, మల్టీ కలర్ ఆర్చ్, ల్యాండ్ స్కాప్ వంటి వెరైటీ ముక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇవే కాకుండా ఆల్ట్రానేత్రా గ్రీన్, ఎల్లో, పింక్, మెండో గ్రాస్, అర్చిపోలియో బ్లాక్, కొలియాస్ రకాలు, సాల్వియా వంటి వేలాది మొక్కలు నూతన సంవత్సరానికి వెల్కమ్ పలుకుతున్నాయి. కనుల పండుగగా కనిపిస్తున్న ఈ మొక్కల చిత్రాల వద్ద ఫోటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు.

స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించే, చైనా, సింగపూర్, మలేషియా వంటి ఇతర దేశాల్లో లభించే చెట్లు సైతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనా కడియపులంక రైతన్నలు ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన కొత్త కొత్త మొక్కలను జనాలకు పరిచయం చేస్తున్నారు.