East Godavari: విషాదం.. కరోనా రోగులకు సేవలందిస్తూ.. అనారోగ్యం బారిన పడిన యువ వైద్యురాలు మృతి..

young doctor died: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ

East Godavari: విషాదం.. కరోనా రోగులకు సేవలందిస్తూ.. అనారోగ్యం బారిన పడిన యువ వైద్యురాలు మృతి..
Young Doctor Died

Updated on: Jun 01, 2021 | 10:04 PM

young doctor died: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ మహమ్మారి పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో యువ వైద్యురాలు కరోనాతో మృతి చెందింది. కోవిడ్ బారిన పడిన బాధితులకు ఆమె సేవలందిస్తూ ఆనారోగ్యం బారిన పడి తనువుచాలించింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. అంతర్వేది పాలెం గ్రామనికి చెందిన యువ వైద్యురాలు ఏలూరు ఆశ్రమంలో కరోనా బాధితులకు సేవలు అందిస్తోంది. ఆమె తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్ పూర్తిచేసి అక్కడే కోవిడ్ రోగులకు చికిత్స చేస్తోంది.

సేవలు అందిస్తున్న క్రమంలో యువ వైద్యురాలు అనారోగ్యం బారిన పడింది. అనంతరం ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె పరిస్థితి విషమించి మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టిన యువ వైద్యురాలు మృతి చెందడంతో అంతర్వేది పాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు

Follow Us