Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..

|

Aug 24, 2021 | 2:56 PM

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా నమోదైనట్లు నేషనల్..

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..
Follow us on

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కాగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు 10 కిలోమీటర్ల లోతులో బంగాళాఖాతంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12.35 గంటలకు భూప్రకంపనలు సంభవించగా.. వీటిని తీవ్రమైనవిగా పేర్కొన్నారు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు. కాగా, భూకంప కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 296 కిలోమీటర్లు ఆగ్నేయంగా, తమిళనాడులోని చెన్నైకి 320 కిలోమీటర్లు ఆగ్నేయంగా ఈ భూకంప కేంద్రం ఉందని చెప్పారు. అయితే, ఈ ప్రకంపనలు సహజమేనని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే, ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల హైతీలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఆఫ్గిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లోని పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. అయితే, ఇవి తక్కువ స్థాయిలోనే నమోదు అయ్యాయి. ఇక ఫసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు ప్రాంతానికి సమీపంలో సంభవించిన భూకంపం కాస్త కలవర పెట్టింది. యూఎస్ అధికారులు.. ఏకంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Also read:

AP Weather ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

NPS vs PPF investment: FD కంటే NPSలో ఒకటిన్నర రెట్లు ఎక్కువ రాబడి.. ఈ ప్రత్యేక మార్గంలో పెట్టుబడి పెట్టండి..

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..!