ఎంత తాగావ్‌రా..! మద్యం మత్తులో కాలేజీ బస్సు కిందకు దూరి ఏం చేశాడో తెలుసా..?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రైవేట్ కాలేజీ బస్సు కిందకు దూరి నడి రోడ్డుపై హంగామా చేశాడు. అతడిని బయటకు రప్పించేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతో పాత జాతీయ రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక్కోసారి మందుబాబుల వేషాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. మద్యం మత్తులో ఒంటిపై స్పృహ లేకుండా వారిని వారే మరిచిపోతారు. రోడ్లపై వీరంగం సృష్టిస్తారు. వారి చిత్ర విచిత్ర ప్రవర్తన, వారు చేసే హంగామా చూసేవారికి ఆశ్చర్యంగా, కొంత నవ్వు తెప్పించే విధంగా ఉన్నా .. పబ్లిక్ కి కొంత న్యూసెన్స్ గాను, ఒక్కోసారి ప్రమాదకరంగాను ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం సాయంత్రం ఓ మందుబాబు చేసిన హంగామా స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో నడి రోడ్డుపై ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు కిందకు దూరి నానా హంగామా చేశాడు. అతడు చేసిన యాగీకి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. కాశీబుగ్గలోని పాత జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో అరగంటపాటు వాహనాలు స్తంభించిపోయాయి.
ఫుల్ గా మద్యం సేవించి ఉన్న పద్మనాభపురం కాలనీకి చెందిన సోమేలు అనే యువకుడు పాత జాతీయ రహదారినీ దాటుతుండగా అటుగా వచ్చిన ప్రైవేట్ కాలేజీ బస్సు తారసపడింది. అదే సందర్భంలో డ్రైవర్‌తో యువకుడికి వాగ్వాదం జరిగింది. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఆ యువకుడు ఏకంగా బస్సు కిందకు దూరాడు. స్థానికులు వాహనదారులు అతనిని బస్సు కింద నుండి బయటకు రప్పించేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా ఆ యువకుడు బయటకు రాడానికి నిరాకరించాడు.
వీడియో చూడండి..
చివరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడికి నచ్చజెప్పి బయటకు రప్పించారు. అయితే బయటకు వచ్చాక కూడా యువకుడు చాలా హంగామా చేశాడు. అతడిని నియంత్రించేందుకు పోలీసులు కూడా కష్టపడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
