AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు.!

లావణ్య- రాజ్‌ తరుణ్‌ కేసులో బిగ్ ట్విస్ట్. డ్రగ్స్ కేసులో మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి అరెస్ట్‌ను అతని తండ్రి తీవ్రంగా ఖండించారు. లావణ్య, పోలీసులు కుమ్మక్కై తన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.

డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు.!
Mastan Sai
Ravi Kiran
|

Updated on: Aug 13, 2024 | 8:45 AM

Share

రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు తీగ లాగితే దాని డొంక గుంటూరులో కదిలింది. రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటిసారి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో 2023లో లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదైంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించిన సెబ్ పోలీసులు గుంటూరులో ఉన్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాంటాక్ట్స్‌పై దృష్టి పెట్టారు. మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు.. సినిమా ఇండ్రస్ట్రీలో ఎవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మస్తాన్ సాయి ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.

తన కొడుకును లావణ్య బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.. మస్తాన్‌ సాయి తండ్రి రామ్మోహన్‌. డ్రగ్స్‌ కేసులో తన కుమారుడికి సంబంధం లేదని.. ఏడాదిగా తన కుమారుడిని లావణ్య వేధిస్తోందని ఆరోపించారు. రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలోనూ సాయికి సంబంధం లేదంటున్నారాయన. మస్తాన్ సాయి వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు ఎంక్వైరీలో తేలింది. హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో.. పట్టుబడ్డ నిందితుడికి మస్తాన్ సాయి డ్రగ్స్‌ ఇచ్చినట్లు తేలింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసిన సెబ్‌ పోలీసులు.. గోపిచంద్, షేక్‌ ఖాజా, క్రాంతి కిరణ్, షరీఫ్ అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ చేసి.. విజయవాడలో విచారిస్తున్నారు సెబ్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..