ప్రకాశం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరనుంచి 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని విశాఖ నుంచి చెన్నైకి కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.