
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా(NTR District) పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లే మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నవాబుపేట జాతీయ రహదారి పై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. లారీనీ ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నందిగామ(Nandi Gama) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. జేసీబీ సహాయంతో ప్రమదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral Video: నరకాని చూసేందుకు జనం క్యూ..! కొద్ది రోజులు మాత్రం తెలిచి ఉంటుంది అంట..!
Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..