Dog Walking: అమలాపురంలో రోజూ మార్నింగ్ జాగింగ్ చేస్తున్న శునకం.. ఏకంగా 25 రౌండ్లు రన్నింగ్

|

Oct 24, 2021 | 9:32 AM

Dog Walking:  మనుషులు వల్లే ఉదయాన్నే లేచి గ్రౌండ్ కు వచ్చి రన్నింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది ఒక శునకం. ఏకంగా గ్రౌండ్ లో 25 రౌండ్లు రన్నింగ్ చేస్తూ..

Dog Walking: అమలాపురంలో రోజూ మార్నింగ్ జాగింగ్ చేస్తున్న శునకం.. ఏకంగా 25 రౌండ్లు రన్నింగ్
Dog Walking
Follow us on

Dog Walking:  మనుషులు వల్లే ఉదయాన్నే లేచి గ్రౌండ్ కు వచ్చి రన్నింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది ఒక శునకం. ఏకంగా గ్రౌండ్ లో 25 రౌండ్లు రన్నింగ్ చేస్తూ అక్కడున్న జనాలకు మతులు పోగొడుతుంది. మనుష్యులకే కాదు మాకు ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం ముఖ్యం అంటున్న శునకం .  ఇది తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అద్భుతం చోటు చేసుకుంది.

అమలాపురంలోని తామర చెరువు వద్ద ఉన్న మెట్ల సత్యనారాయణ ఆరోగ్య ఉద్యానవనం పార్కులో ఉదయాన్నే వాకింగ్ కు వచ్చిన జనాల తో సందడి నెలకొంటుంది. అయితే గత వారం రోజుల నుంచి వాకర్స్ తో పాటు కుక్క కూడా పార్క్ కు వచ్చి వాకింగ్ చేస్తోంది. ఈ కుక్క ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కానీ ఉదయాన్నే పార్క్ లోకి జనాలతో పాటు వచ్చి ఏకంగా ఆగకుండా 25 రౌండ్లు రన్నింగ్ చేస్తుంది. కుక్క వాకింగ్ ను చూసిన జనం ఒకింత చర్యానికి లోనవుతున్నారు. మనుషులే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు.. ఎక్కడో కొద్ది మంది మాత్రం ఉదయమే లేచి.. వ్యాయామం చేస్తున్నారు.

సర్వసాధారణంగా ఎక్కువమంది ఉదయమే నిద్ర లేచి కొద్దిసేపు వ్యాయామం చేయడానికి చాలా బద్ధకిస్తుంటారు. అటువంటిది శునకం గత వారం రోజులుగా ఉదయాన్నే వచ్చి గ్రౌండ్ లో ఏకంగా 25 రౌండ్లు రన్నింగ్ చేయడం అందరిని ఆలోచింపజేస్తుంది. అంతేకాదు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికైనా వ్యాయామం చేయకుండా సోమర పోతుల్లా నిద్రపోతున్న మనుషులు దీన్ని చూసైనా నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.. ఈ రోజుల్లో యువకులే బద్ధకం అంటూ ఉదయం నిద్ర లెవలేకుండా బారెడు పొద్దెక్కిన తర్వాత మంచం దిగుతున్న పరిస్థితులున్నాయి. ఈ శునకం మాత్రం ఎర్లీ మార్నింగ్ పార్కుల్లో వాకింగ్ చేయతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు

Also Read:  తన అభిమానిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించిన చిరు.. అవసరమైతే మెరుగైన చికిత్స చెన్నై తరలించడానికి రెడీ అని హామీ