Praveen Chakravarthy: గిరి పుత్రుల గొంతు తడిపిన మరో భగీరథుడు డాక్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి

|

Oct 04, 2024 | 7:44 AM

ఇటీవలే వచ్చిన ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారం భారత దేశంలో నీటి వనరుల సమస్య వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల స్థాయిలు ఐదేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇవి మరింతగా క్షీణించి భయంకరమైన నీటి సంక్షేమానికి దారితీస్తాయి. దీనివల్ల లక్షల మందిని నీటి కొరతతో బాధపడుతున్నారు..

Praveen Chakravarthy: గిరి పుత్రుల గొంతు తడిపిన మరో భగీరథుడు డాక్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి
Praveen Chakravarthy
Follow us on

ఇటీవలే వచ్చిన ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారం భారత దేశంలో నీటి వనరుల సమస్య వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల స్థాయిలు ఐదేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇవి మరింతగా క్షీణించి భయంకరమైన నీటి సంక్షేమానికి దారితీస్తాయి. దీనివల్ల లక్షల మందిని నీటి కొరతతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది.

ఈ విపత్కర పరిస్థితులతో కారు చీకట్లు కమ్ముకున్న వీళ్ళ జీవితాల్లో ఒక వ్యక్తి వీళ్ళ జీవితానికి ఆశాజ్యోతి వెలుగులు నింపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సోషల్‌ వర్కర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి (Praveen Chakravarthy) కేవలం నీటి కొరతనే కాకుండా భారత దేశంలో అత్యంత బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యను తీర్చేందుకు వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు.

ప్రవీణ్‌ కాకినాడ నుంచి దేశంలో ఉన్న మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రయాణిస్తూ భారతదేశంలో ఉన్న వివిధ సంస్కృతులు గురించి తెలుసుకునే క్రమంలో ఒకరోజు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సన్నివేశం అతను మార్గాన్ని సాంస్కృతిక ఔత్సాహకుని నుంచి సామాజిక సేవకుడిగా మార్చింది. అతను ముందు జరిగిన సంఘటన అతను గమ్యాన్ని మార్చింది. సమీపంలో బోర్‌వెల్‌ ఉన్నప్పటికీ నీటి కోసం సుమారు నాలుగు మైళ్ళు నడవాల్సి వచ్చిన సంఘటన అతను హృదయాన్ని కదిలించింది. దగ్గరలో ఉన్న బోర్వెల్ లో నీళ్లు తీసుకుందామంటే ఆమె కులం అడ్డొచ్చింది. తక్కువ కులం వాళ్ళు ఆ బోర్‌వెల్‌ నుంచి నీరు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ సంఘటన చూసి నీటి సమానత్వం కోసం పోరాడాలని స్ఫూర్తి ప్రవీణ్ లో రేకెత్తించింది.

ఈ సంఘటనే అతని మొదటి కుల రహిత బావిని సృష్టించడానికి దారితీసింది. కులంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే 400 అడుగుల లోతైన బోర్‌వెల్‌ ఇప్పుడు సుమారు పదివేల కుటుంబాలకి సేవ చేస్తున్న ఈ ప్రాజెక్టు అతని జీవితంలో ఒక గొప్ప విజయం ఈ ఒక్క బీజం ఒక మహా వృక్షానికి ప్రయాణమైంది.

గత 13 సంవత్సరాలుగా డాక్టర్ ప్రవీణ్‌ భారతదేశంలోనే అత్యంత నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించి తరచూ కాలినడకన సవాలను ఎదుర్కొంటూ వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ సర్వేలు నిర్వహించారు. స్థానిక సంఘాలతో మాట్లాడి సమాన నీటి ప్రాముఖ్యత వివరిస్తూ వాళ్లలో అవగాహన పెంచి నిర్విరామంగా పనిచేశారు.

డాక్టర్ ప్రవీణ్‌ నీటి కొరతను తీర్చేందుకు 6000 పల్లెలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సర్వేలు చేయించి 2000 పైగా గ్రామాలలో నీటి సమస్యను గుర్తించి ఆ గ్రామాల్లో బోర్‌వెల్‌ వేయించి 15 లక్షలకు పైగా ప్రజలకు తాగునీటినందించారు. అతని కృషి ఫలితంగా నాలుగు రాష్ట్రాల్లో 2100 కంటే ఎక్కువ బోర్‌వెల్‌ ఏర్పాటు అయ్యాయి.

ఏపీ 1200, ఒడిస్సా 400, జార్ఖండ్ 300, బీహార్ 200. ఈ బావులు గతంలో సామాజిక, ఆర్థిక వివక్షతో ఉండేవి కానీ డాక్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి పోరాటంతో అట్టడుగున ఉన్న సమాజానికి వారి వేలాది కుటుంబాలకు ఇప్పుడు స్వచ్ఛమైన తాగునీటిన అందిస్తున్నాయి. కాకినాడకు చెందిన ప్రవీణ్‌ చక్రవర్తి కేవలం బావలను తవ్వించడమే కాదు నీటి వనరుల నిర్వహణ, మరమతులకు బాధ్యత వహించి కమ్యూనిటీ బృందాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి లక్ష్యం నీటి కొరత, కుల ఆధారిత వివక్ష రెండింటికి వ్యతిరేకంగా ఈ కమ్యూనిటీలు పని చేస్తాయి.

డాక్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి లక్ష్యం కేవలం స్వచ్ఛమైన నీటి అందించడమే కాకుండా అంతకుమించిగా ఎదిగింది అతని లక్ష్యం మానవత్వం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఆయనకు తోడయ్యారు. ఇతని దేశంలోనే వెనకబడి ఉన్న వర్గాలకు వారి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి గౌరవాన్ని మరింత పెంచారు. ఈ గొప్ప కార్యక్రమానికి స్నేహితులు ఎన్జీవోలు, అంతర్జాతీయ మిత్రులు మద్దతు గా నిలిచారు.

డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి తన తండ్రి అయిన ఎస్ ఎస్ కిరణ్ కుమార్ Sylom Blind Centre ద్వారా ప్రజలకి సేవలు అందించేవారు. చిన్నతనం నుంచి ఇది చూస్తున్న ప్రవీణ్ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అతని సేవా భావాన్ని వారసత్వంగా సామాజిక సేవను కొనసాగించారు.

నీటి కొరతను ఎదుర్కోవడానికి కేవలం సాంకేతిక  పరిష్కారాలే కాకుండా సామాజిక అసమాన్యతులను కూడా పరిష్కరించాలని ఈ అసమానతలను శాశ్వతంగా సమాజం నుంచి తరిమి వెయ్యాలని మనకు చెబుతుంది. సమాజాన్ని మంచి మార్కులు నేర్పించడానికి సమిష్ఠ కృషి అవసరమని డాక్టర్ ప్రవీణ్‌ చక్రవర్తి ప్రయాణం అడుగడుగునా వివరిస్తు నిరూపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి