DCCB: సహకారబ్యాంకు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తాం.. కొత్తగా 100 డీసీసీబీ బ్రాంచ్‌ల‌ు: మంత్రి కన్నబాబు

|

Sep 05, 2021 | 12:45 PM

రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

DCCB: సహకారబ్యాంకు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తాం.. కొత్తగా 100 డీసీసీబీ బ్రాంచ్‌ల‌ు:  మంత్రి కన్నబాబు
Dccb
Follow us on

District Co-Operative Banks in AP: రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా 100 కొత్త డీసీసీబీ బ్రాంచ్‌ల‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సదరు బ్యాంకుల్లో రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దివంగతనేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గలేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షం చేస్తున్న వాదనలు అవాస్తవమ‌ని చెప్పిన ఆయన.. గత ప్రభుత్వ సమయంలో (2014-15) నుండి (2018-19) వరకు GST, పెట్రోలియం ప్రోడక్ట్స్, మద్యం, వృత్తులపై ఉన్న పన్నుల మొత్తం 10.03% (CAGR) మేర ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింద‌ని తెలిపారు. కానీ 2019-20 మరియు 2020-21 లో పై పన్నుల ఆదాయం కేవలం 1.30% (CAGR) మాత్రమే పెరిగింద‌ని వివరించారు.

అంటే. ఒక్క సంవత్సర కాల పరిమితిలో పై పన్నులలో సాధారణ పెరుగుదల (10.03%) లేకపోవడం వల్ల మన ప్రభుత్వం రూ. 7,947.07 కోట్లు ఆదాయం కోల్పోయిందని ఆర్థికమంత్రి చెప్పారు. కరోనా లాక్ డౌన్ సమయమైన ఏప్రిల్ 2020 మరియు మే 2020 నెలలో పై పన్నుల నుండి రావాల్సిన ఆదాయము రూ. 4,709.24 కోట్లరు పడిపోయిందని మంత్రి బుగ్గన ఒక ప్రక‌ట‌నలో పేర్కొన్నారు.

Read also: Children Health: కొవిడ్ నేపథ్యం: చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న రుగ్మతలను బయటపెట్టిన అధ్యయనం