Vizag Airport: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి డీజీ యాత్ర సేవలు

|

Sep 06, 2024 | 9:15 PM

విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. DG యాత్ర సేవలు ప్రారంభమాయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు DG సేవలను ప్రారంభించారు. 20 ఏళ్లలో దేశంలో 400 ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

Vizag Airport:  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి డీజీ యాత్ర సేవలు
Vizag Airport
Follow us on

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో డీజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిజరపు రామ్మోహన్ నాయుడు డీజీ సేవలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ తోపాటు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. పట్నా, రాయ్ పూర్, భువనేశ్వర్, గోవా, ఇండోర్, రాంచి, కోయంబత్తూర్, బాగ్ డోగ్రా ఎయిర్ పోర్ట్ ల్లో కూడా డీజీ సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 15 ఎయిర్‌పోర్టులో ఈ సదుపాయం ఉంది. ఇప్పుడు మరో తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. DG యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. పేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి సులభతర సేవలు అందుతాయి. చెక్ పాయింట్లు, బోర్డింగ్ పాయింట్ల వద్ద ఈజీ యాక్సెస్ ఉంటుంది. డిజి యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లోనే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. 5 సెకండ్లలో ఎంట్రీ అయ్యేలా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తిచేస్తామన్నారు కేంద్రమంత్రి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం సింగిల్ డిస్ట్రిక్ట్ గా సహకరిస్తుందాన్నారు. విశాఖ నుంచి మళ్లీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీ ప్లేన్స్ ను త్వరలో అందుబాటులోకి తెచ్చేలా .. త్వరలో డెమో ప్లైన్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం డ్యాం ప్రాంతాల్లో పరిశీలిస్తామన్నారు కేంద్రమంత్రి రామ్మెహన్‌నాయుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.