Train Derailed: ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. జిల్లాలో పలాస రైలు నిలయం రూట్ నెంబర్ 11 లో గురువారం తెల్లవారుజామున రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. (Palasa) స్టేషన్లో ఎమర్జెన్సీ బెల్ మోగడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. హైడ్రాలిక్ జాకీ సహాయంతో వెంటనే ఇంజన్ ను తిరిగి పట్టాలపైకి సరిచేశారు రైల్వే సిబ్బంది. ఇంజన్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రైన్ ఫైలెట్లు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. కాగా.. దీనిపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ట్రాక్ సమస్యతోనే ట్రైన్ పట్టాలు తప్పిందా..? లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే.. శ్రీకాకుళం జిల్లాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.
రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో..
రెండు రోజుల క్రితం సోమవారం శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బాతువ రైల్వే గేటు సమీపానికి వచ్చి నిలిచిపోయింది. దీంతో బోగీల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది.
Also Read: