
Olive Ridley Turtle: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో అరుదైన తాబేళ్ల (Tortoise సంరక్షణకు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ (Forest Department) ఆధ్వర్యంలో చేపట్టిన సంరక్షణ కేంద్రంలో సేకరించిన సముద్రపు తాబేళ్ల గుడ్ల నుంచి పొదిగిన 3 వేల తాబేలు పిల్లలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సతీమణి రమాదేవి ఈ రోజు సముద్రంలో వదిలారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని బాపట్ల సూర్యలంక లో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్ అవనిగడ్డ అటవీ రేంజ్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది 30 పెద్ద తాబేళ్లు ఒడ్డుకు చేరి 3,400 వరకు గుడ్లు పెట్టటం జరిగింది. వాటిని సంరక్షణలో ఉంచి 3 వేల వరకు పిల్లలను సముద్రంలోనికి వదిలివేయడం జరిగింది. ఆలీవ్ రిడ్లే కు చెందిన తాబేళ్ళు తమ సంతానోత్పత్తి కోసం సముద్ర తీరంలో ఇసుక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి. 120 నుండి 150 వరకు గుడ్లు పెట్టి ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లి పోతాయి. గుడ్లను ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఇసుకతో కప్పేసి తాబేళ్ళు సముద్రంలోకి వెళ్లి పోతాయి. సూర్యలంక సముద్రతీరంలోని తాబేళ్ల సంరక్షణ సమితి వీటిని సంరక్షిస్తూ వస్తుంది. 10 అంగుళాల లోతు గుండ్రం గా గుంత తీస్తారు ఆ గుంటలో 100 నుండి 150 వరకు గుడ్లను పెట్టి వాటిని కప్పేస్తారు. సహజసిద్ధంగా 50 నుండి 55 రోజుల్లో గుడ్ల నుండి పిల్లలు బయటకు వస్తాయి. తీర ప్రాంతాల్లో తాబేలు గుడ్లు పెట్టిన ప్రాంతాన్ని వాటి అడుగుల ఆనవాళ్లను గుర్తించి వాటిని ఇక్కడి ఒక సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. రానున్న రోజుల్లో ఈ సంరక్షణ కెంద్రాన్ని అతి పెద్ద కేంద్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Reporter : T Nagaraju, TV 9 Telugu
Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సమ్మర్ సెలవుల్లో మరిన్ని స్పెషల్ రైళ్లు..