Anantapur: ఎస్సై ప్రేమ వంచనకు ఓ యువతి బలి.. విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి..

|

May 07, 2022 | 7:18 AM

Anantapur: అతడొక ఎస్సై (SI).. బాధ్యత గల ఉద్యోగం.. నేరస్థులను పట్టుకోవడం.. నేరాలు జరగకుండా చూడడం.. బాధితులకు తగిన న్యాయం చేయడం.. అయితే ప్రవృత్తి యువతులను ప్రేమలోకి దించి..

Anantapur: ఎస్సై ప్రేమ వంచనకు ఓ యువతి బలి.. విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి..
Woman Commits Suicide
Follow us on

Anantapur: అతడొక ఎస్సై (SI).. బాధ్యత గల ఉద్యోగం.. నేరస్థులను పట్టుకోవడం.. నేరాలు జరగకుండా చూడడం.. బాధితులకు తగిన న్యాయం చేయడం.. అయితే ప్రవృత్తి యువతులను ప్రేమలోకి దించి ప్రేమ పేరుచెప్పి వంచించడం.సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఆయన యువతులను ప్రేమ ముగ్గులోకి దించి వంచించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని ప్రేమ వంచనకు డిగ్రీ చదువుకున్న ఓ యువతి బలి అయ్యింది.  ఆ నయవంచకుడి ప్రేమ వలలో చిక్కుకుని మోసపోయి ఆత్మహత్యకు పాల్పడింది అనంతపురం జిల్లా(Anantapur District) పామిడి పోలీస్ స్టేషన్(Pamidi Police station) పరిధిలో ఓ యువతి వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన బీమ్లా నాయక్ కుమారుడు విజయ్ కుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో లో జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతి అనే యువతి తిరుపతిలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉండేది. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే గత కొద్ది రోజుల క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అయితే రెండు రోజుల క్రితం మనస్థాపం చెందిన సరస్వతి స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.అయితే శుక్రవారం చికిత్స పొందుతూ అనంతపురం ఆస్పత్రిలో మృతి చెందింది. తన ఆత్మహత్యకు ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ కారణమంటూ ఫిర్యాదు చేసి చనిపోయింది. దీంతో ప్రియురాలు ఆత్మహత్యతో ఎస్సై బండారం బయటపడింది.

అంతేకాకుండా గత ఏడాది ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ అనంతపురం కు చెందిన భారతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహమే… అప్పట్లో భారతీ తనను ప్రేమించి మోసం చేశాడంటూ అనంతపురం దిశా పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ పై డిఎస్పి ఆర్ల శ్రీనివాసులకు ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో విజయ్ కుమార్ పెళ్లికి అంగీకరించాడు దీంతో పెద్దల సమక్షంలో ఇరువురికి పెళ్లి జరిపించారు.పెళ్లి అయినా ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఎస్ఐ ఉద్యోగం రాక ముందు కూడా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో పని చేసే వాడని అప్పట్లో ఓ మహిళా కానిస్టేబుల్ ను ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కూడా తెలుస్తోంది. మృతురాలు సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ మేరకు పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: 

Afghanistan: మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు.. వాహనాలు నడిపి తీరుతామంటున్న యువతులు.. ఎక్కడంటే?