Cyclone Michaung: ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మిచౌంగ్’ ముప్పు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

|

Dec 04, 2023 | 8:41 PM

Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుఫానుతో అప్రమత్తమైంది ఏపీ సర్కారు. నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చన్న సమాచారంతో కలెక్టర్లతో సమీక్ష జరిపారు సీఎం జగన్. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారుల్ని నియమించారు. NDRF, SDRFతో పాటు అవసరాన్ని బట్టి వాలంటీర్లు, గ్రామ సచివాలయం సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు.

ఈ మేరకు ప్రభుత్వం తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది.

  • బాపట్ల – కాటమనేని భాస్కర్‌
  • అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి
  • తూర్పుగోదావరి – వివేక్‌ యాదవ్‌
  • కాకినాడ – యువరాజ్‌
  • ప్రకాశం – ప్రద్యుమ్న
  • ఎస్‌పిఎస్‌ నెల్లూరు – హరికిరణ్‌
  • తిరుపతి – జె.శ్యామలరావు
  • వెస్ట్‌గోదావరి – కన్నబాబు

కాగా.. తుఫాన్.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరానికి మరింత సమీపిస్తుంది. చెన్నైకి 100, నెల్లూరుకు 120, పాండిచ్చేరి 220, బాపట్ల 250, మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు – మచిలీపట్టణం మధ్య బాపట్ల సమీపంలో రేపు ఉదయానికల్లా మిచౌంగ్ తీరం దాటుతుంది. తుపాను తీరం దాటే సమయంలో 90- 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు తీరప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..