AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో(Andhrapradesh)లో అసని తుఫాన్ ప్రభావంతో ఓ వైపు వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలుతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అసని (Asani Cyclone).. సాయంత్రం తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్టణం, నర్సాపూర్ కి మధ్య తీరం దాటింది. ఈరోజు మరింత బలహీనపడి వాయుగుండంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. తదుపరి 12 గంటలలోఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది వాతావరణ శాఖ.
ఉత్తర కోస్త, యానాం: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది . మే 14వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:ఈ రోజు, రేపు, ఎల్లుండి (మే14వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి (మే 14వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది.
మరిన్ని వాతావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.