CPI Ramakrishna: జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమంటున్న సీపీఐ.. బీజేపీ పక్కన పెట్టాలని సూచన..

|

Oct 10, 2023 | 8:06 AM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై బీజేపీ పెద్దలకు కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ పవన్‌ను పట్టించుకొని పరిస్థితిలో లేదన్నారు. పవన్‌ కళ్యాణ్ ఎన్డీఏ ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం హర్షం దగ్గ విషమన్నారు. ఆయన గట్స్ ను మెచ్చుకొని తీరాల్సిందేనన్నారు రామకృష్ట.

CPI Ramakrishna: జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమంటున్న సీపీఐ.. బీజేపీ పక్కన పెట్టాలని సూచన..
Cpi On Pawan
Follow us on

ఓ వైపు తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది.. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై ఎన్నికల్లో పోటీ చేసే ఎత్తులపై రాజకీయనేతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనలు కలిసి వెళ్తాయని ప్రకటించారు. తాజాగా సీపీఐ కూడా తన స్వరం వినిపించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కేంద్రం పట్టించుకోవడం లేదు.. కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రామకృష్ణ. అంతేకాదు జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధం ఉన్నామని స్పష్టం చేశారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై బీజేపీ పెద్దలకు కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ పవన్‌ను పట్టించుకొని పరిస్థితిలో లేదన్నారు. పవన్‌ కళ్యాణ్ ఎన్డీఏ ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం హర్షం దగ్గ విషమన్నారు. ఆయన గట్స్ ను మెచ్చుకొని తీరాల్సిందేనన్నారు రామకృష్ట.

ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో పవన్‌ను తాము అభినందిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని పక్కనబెట్టి టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఏం కలిసి పోటీ చేయాలని కోరారు. ఈ పొత్తుతో జగన్‌ ను ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఏపీ నష్టపోతుందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తే.. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల రావడంతో కృష్ణాజలాల పునః పంపిణీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఏపికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు రామకృష్ణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..