
ప్రేమ జంటను మృత్యువు కదిలించింది.. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యును జయించలేకపోయింది.. మృత్యువు ముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప పుట్టింది. కుటుంబ సభ్యులు అక్కున చేర్చుకున్న రోజునే భార్యాభర్తలు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంతోషంగా గడిపిన గంట క్షణాల్లో భోజనం చేసి ఆధార్ కార్డులు అప్డేట్ కోసం రాజానగరంలోని బ్యాంకుకు బయలుదేరిన భార్యాభర్తలకు సిమెంట్ లారీ రూపంలో మృత్యు ఒడిలో పొట్టన పెట్టుకుంది.. ప్రమాద సమయంలో లారీ రెండు స్కూటీలను ఢీకొంటూ వెళ్లింది. నుజ్జునుజైన స్కూటీపై వెళుతున్న ఇద్దరు స్వల్పగాయలతో బయటపడగా.. కనీసం స్కూటీపై గీత కూడా తగలని బండిపైన ఉన్న భార్యాభర్తలు చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైఎస్సార్ జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో స్కూటీ పై వెళుతున్న భార్య భర్తలు జుత్తుక లీలా ప్రసాద్ (22) సోనియా (20)అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా సిమెంట్ లోడుతో వైజాగ్ వైపు వెళ్తున్న లారీ టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలు ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. స్కూటీ ముక్క ముక్కలుగా జాతీయ రహదారిపై పడింది. ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఇరువురికి మూడు నెలల పాప. ఈ ఘటన నందరాడ గ్రామంలో కుటుంబంలో విషాదం నెలకొంది.
ముక్కుపచ్చలారని మూడు నెలల పాపను వదిలి భార్యాభర్తలు అనంత లోకానికి వెళ్లిపోయారు. ఘటన స్థలానికి రాజానగరం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ క్లీనర్ పరారయ్యారని వారి కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..