Corona Virus: చైనాలో పుట్టి.. ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్.. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమందిలో మానవత్వం పరిమళిస్తే.. మరికొందరిలో నేను నాది అనే స్వార్ధం పెరిగిపోయింది. ఇక కరోనా బాధితులు అద్దెకి ఉండేవారు అయితే వారి కష్టాలు చెప్పతరం కాదు.. మంచి తనం మానవత్వం మరచిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
నెల్లూరి నగరంలోని ఓ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎదురింటి ప్లాట్ యజమాని విపరీతంగా రియాక్ట్ అయ్యి,.. ఆ దంపతులను ఇంట్లో పెట్టి.. బయట తాళం పెట్టాడు. ఈ దారుణ ఘటన నవాబ్ పేట ఎం ఆర్ ఎం రెసిడెన్సీలో చోటు చేసుకుంది. బాధితులు వెంటనే ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధి లో ఫ్లాట్ వద్దకు చేరుకుని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తాళం వేసిన సదరు వ్యక్తి.. కరోనా పాజిటివ్ కరోనా పాజిటివ్ బాధితులకు రావడం ఏమిటి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నాడు.. మరి ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్టారో చూడాలి మరి
Also Read: ఈ గుడిలో అన్ని అద్భుతాలే.. నాలుగో స్థంభం విరిగిన రోజున కలియుగం చివరి రోజట
సబ్జా గింజలు మహిళలకు ఓ దివ్య వరం…. సబ్జాలను ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం