AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తిని వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్ పాజిటివ్‌....

బ్రేకింగ్: ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2020 | 1:23 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు. నగరంలోని చిన్న బజారుకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చారు. అతడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఆస్పత్రిలో చేర్పించారు. సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వైరస్ లక్షణాలు కనిపించడంతో కరోనా భాదితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  పాజిటివ్ కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా లక్షణాలతో నెల్లూరు యువకుడు ఆస్పత్రిలో చేరడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఇటలీ నుంచి పలు దఫాల్లో 75 మంది ఏపీకి వచ్చారు. అయితే, ఆ దేశంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్లంతా ఇంట్లోనే ఉండాలి. 14 రోజుల పాటు ఇంట్లో ఏకాంతంగా, ఐసోలేటెడ్ గదిలో ఉండాలి. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లను గానీ, చుట్టాలను గానీ కలవవద్దు. గది దాటి బయటికి రాకూడదు అని సూచించింది.

Read More : తిరుమలలో విఐపీ దర్శనాలకు బ్రేక్…