సందట్లో సడేమియా అనే సామెత వినే ఉంటారు. అదే జరిగింది.. మొన్నీమధ్య గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్లు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. అయితే దాడి తర్వాత టీడీపీ ఆఫీస్‌లోకి ఎంటరైన కానిస్టేబుల్ ఆఫీస్‌లోని డ్రాల్లో వస్తువుల కోసం తెగ వెతుకులాడాడు. చేతికి దొరికిన ఇయర్‌బడ్స్‌ను చప్పిడి కాకుడా జేబులో వేసుకున్నాడు. ఇంకా వెతుక్కుంటూ ఉండగా మిగతా వాళ్లు లోపలికి వచ్చారు. వాళ్లతో కలిసి అమాయకంగా ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చాడు కానిస్టేబుల్
వైరల్ అవుతున్న సీసీఫుటేజ్ దృశ్యాలను మీరు క్లియర్‌గా చూడొచ్చు. పార్టీ ఆఫీస్‌లోకి వచ్చిన కానిస్టేబుల్ నేరుగా టేబుల్ డ్రాల్లో ఏమున్నాయో వెతుక్కున్నాడు. అందులో ఇయర్ బడ్స్ కనిపించినట్లున్నాయి. వాటిని చెక్‌చేసుకున్నాడు. ఈలోపు వేరే ఎవరో కంటికి కనిపించడంతో దాన్ని అక్కడే పెట్టాడు. కొన్ని క్షణాల్లోనే మళ్లీ తీసి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఏదో వెతుక్కోబోతుండగా ఒకరిద్దరు పోలీసులు, కార్యకర్తలు వచ్చారు. దీంతో అక్కడి నుంచి వాళ్లతో కలిసి బయటపడ్డాడు ఆ కానిస్టేబుల్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.