తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!

మీ చేతిలో తుపాకీ ఉందా. అయితే జాగ్రత్త.. ఏ క్షణమైనా మిస్ ఫైర్ అవచ్చు..! అంతేకాదు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి సంఘటన ఎక్కడ ఎందుకు జరిగిందంటే ఈ వార్త చదవాల్సిందే..! నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో చేతిలో ఉన్న తుపాకీ మెస్ ఫైర్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడకు వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!
Constable Peddaiah Died With Gun Misfire

Edited By:

Updated on: Jan 27, 2026 | 12:38 PM

మీ చేతిలో తుపాకీ ఉందా. అయితే జాగ్రత్త.. ఏ క్షణమైనా మిస్ ఫైర్ అవచ్చు..! అంతేకాదు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి సంఘటన ఎక్కడ ఎందుకు జరిగిందంటే ఈ వార్త చదవాల్సిందే..! నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో చేతిలో ఉన్న తుపాకీ మెస్ ఫైర్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడకు వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పెద్దయ్య, గుంతకల్లు నుంచి డోన్‌కు వచ్చారు. ఆదివారం (జనవరి 26) తెల్లవారుజామున 3 గంటల సమయంలో జీఆర్‌పీ కార్యాలయంలో గన్ సరెండర్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో లోడ్ చేసి ఉన్న గన్ మిస్ ఫైర్ అయింది. సరిగ్గా బాడీలోకి తూట చొచ్చుకు పోయింది. ఆ వెంటనే ప్రాణాలు పోయినట్లు సహచర పోలీసులు చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని స్థానిక డోన్ డీఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అవడం వల్లే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కర్నూలు జిల్లా సి బెళగల్ ప్రాంతానికి చెందిన మృతుడు పెద్దయ్యకు భార్య సునీత కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన గతంలో కర్నూలు జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిచ ప్రస్తుతం డోన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పెద్దయ్య మృతితో తీవ్ర విషాదఛాయు అలుముకున్నాయి. సి.బెళగల్ లో పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించారు. ప్రతిరోజు కొన్ని వేల మంది చేతిలో తుపాకులు ఉంటున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా.. చూశారుగా ఎంత ప్రమాదం జరిగిందో చివరకు ప్రాణం కూడా పోతాయి. సో… తుపాకులు చేతిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..