Viral: పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు గుండె గుభేల్!

|

Apr 12, 2023 | 6:23 PM

సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాం..

Viral: పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు గుండె గుభేల్!
Andhra Pradesh
Follow us on

సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాం. అసలే ఇప్పుడు ఎండాకాలం కావడంతో.. పాములు జనాల మధ్యకు వచ్చి కలకలం రేపుతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా పెనుకొండలోని రొద్దం మండల తహశీల్దార్ కార్యాలయంలోకి దూరి ఓ నాగుపాము స్థానికంగా కలకలం రేపింది. ఎండవేడికి తట్టుకోలేని ఈ విషసర్పం.. కార్యాలయంలోకి వచ్చి ఎంచక్కా సేద తీరింది. ఇక ఈ నాగుపామును చూసేందుకు భారీగా స్థానికులు తరలివచ్చారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి