YS Jagan: కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడోవ రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడులోని నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి బస్సు యాత్ర శుక్రవారం ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా సీఎం జగన్ రాళ్లదొడ్డి చేరుకోనున్నారు.

YS Jagan: కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే..
Ys Jagan
Follow us

|

Updated on: Mar 29, 2024 | 8:38 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడోవ రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడులోని నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి బస్సు యాత్ర శుక్రవారం ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా సీఎం జగన్ రాళ్లదొడ్డి చేరుకోనున్నారు. మొత్తం మూడు నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండలో యాత్ర జరగనుంది. కోడుమూరు, గోనెగండ్ల మీదుగా.. ఎమ్మిగనూరుకు జగన్‌ బస్సు యాత్ర చేరుకోనుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

అనంతరం ఎమ్మిగనూరు నుంచి అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా సీఎం జగన్ రాత్రికి పత్తికొండ చేరుకుంటారు. రాత్రి పత్తికొండ మండలం రాతన గ్రామంలో జగన్‌ బస చేస్తారు.

కాగా.. రెండో రోజు ఆళ్లగడ్డలో మొదలైన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మధ్య మధ్యలో తనను కలిసేందుకు వచ్చిన వాళ్లందర్నీ అప్యాయంగా పలకరించారు. ఇక నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీలపై మండిపడిన జగన్.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ అమలవుతుందన్నారు.

అక్కడి నుంచి బయలుదేరిన సీఎం జగన్… తన కోసం ఎదురుచూస్తున్న పాణ్యంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు సీఎం జగన్ అభివాదం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..